Against Defamation: తుళ్లూరు పీఎస్‌లో డిప్యూటీ సీఎం ఓఎస్డీ ఫిర్యాదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:28 AM
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బురదజల్లే కార్యక్రమం జరుగుతుందని ఆయన ఓఎస్డీ వెంకటకృష్ణ ఫిర్యాదు చేసినట్టు తుళ్లూరు...
తుళ్లూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బురదజల్లే కార్యక్రమం జరుగుతుందని ఆయన ఓఎస్డీ వెంకటకృష్ణ ఫిర్యాదు చేసినట్టు తుళ్లూరు సీఐ-2 అంజయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవాలంటే డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాలలో గ్రూపు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నాడని, అతనిడిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంగళవారం ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అసత్య ప్రచారం రాజధానికి చెందిన వ్యక్తే చేస్తున్నాడని ప్రాథమిక అంచనాకు రావటంతో తుళ్లూరు పీఎ్‌సలో పవన్ కల్యాణ్ ఓఎస్డీ ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు.