Share News

AP Weather: కోస్తా సీమలను కమ్మేసిన మంచు, చలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:09 AM

కోస్తా, రాయలసీమల్లో పొగమంచు, చలి కొనసాగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే...

AP Weather: కోస్తా సీమలను కమ్మేసిన మంచు, చలి

విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లో పొగమంచు, చలి కొనసాగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో చలి, పొగమంచు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Dec 27 , 2025 | 04:10 AM