Share News

వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , Publish Date - May 28 , 2025 | 11:46 PM

వైసీపీ హయాంలో ఒక మీటింగ్‌ పెట్టుకొని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

   వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ
మహానాడు సభలో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

నిద్రలేని రాత్రులు గడిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం

గంజాయి, ఫ్యాక్షనపై ఉక్కుపాదం మోపిన సీఎం చంద్రబాబు

మహానాడులో మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, మే 28(ఆంఽఽధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఒక మీటింగ్‌ పెట్టుకొని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం కడప జిల్లాలో నిర్వహించే మహానాడు సభలో రెండో రోజు ఆయన ప్రసంగించారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయ మన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ యువగళం యాత్రకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారన్నారు. ల్యాండ్‌ మాఫి యాతో ప్రజల ఆస్థులను వైసీపీ నాయకులు కొల్లగట్టారన్నారు. సోషల్‌మీడియాలో పని చేసే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లను బెదిరించి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారన్నారు. టీడీపీ అధికా రంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తెచ్చామ న్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా సీఎం చంద్రబాబునాయుడు తీర్చి దిద్దారన్నారు. మూడు దశాబ్దాల క్రితమే రాయలసీమ ఫ్యాక్షనపై చంద్రబాబునాయుడు ఉక్కుపాదం మోపారన్నారు. రాయలసీమలో బాంబుల సంస్కృతికి చెక్‌ పెట్టడానికి సొంత పార్టీ నేతల విషయంలోనూ ఉపేక్ష చూపించలేదన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:01 PM