Bail Escape: హత్య చేసి హిమాలయాలకు..
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:40 AM
హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన వ్యక్తి హిమాలయాలకు పారిపోయి నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.
నాలుగేళ్ల తరువాత ఇంటికి.. అరెస్టు
విశాఖపట్నం/మహారాణిపేట, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన వ్యక్తి హిమాలయాలకు పారిపోయి నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. నిఘా పెట్టిన పోలీసులు శనివారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి వివరాలను వెల్లడించారు. పూర్ణామార్కెట్‌కు చెందిన పిచ్చేడి యుగంధర్ (39) 2021లో సుబ్బారెడ్డి అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్యచేశాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన, హిమాలయాలకు వెళ్లి బైరవస్వామి బాబాగా పేరు మార్చుకున్నాడు. కుటుంబసభ్యులతో కూడా సంబంధాలు లేవు. ఇటీవల స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు నిఘా పెట్టారు. శనివారం యుగంధర్ నగరానికి వస్తున్నట్టు నిర్ధారించుకొని, రైల్వే క్వార్టర్స్ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.