Share News

17న ఢిల్లీలో ఆత్మగౌరవ ప్రదర్శన: మందకృష్ణ

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:37 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌పై దాడి ఘటనలో న్యాయ, మానవ హక్కుల కమిషన్‌, పోలీసు వ్యవస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని...

17న ఢిల్లీలో ఆత్మగౌరవ ప్రదర్శన: మందకృష్ణ

కావలి(టౌన్‌) నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌పై దాడి ఘటనలో న్యాయ, మానవ హక్కుల కమిషన్‌, పోలీసు వ్యవస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఎమ్మార్సీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లా కావలిలో మాట్లాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా మూడు వ్యవస్థలు నిర్లక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ 17న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహా ఆత్మగౌరవ ప్రదర్శన కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు.

Updated Date - Nov 08 , 2025 | 05:38 AM