Acharya Jayant M. Modak: దేశాభివృద్ధిలో డిగ్రీలు కీలకం
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:57 AM
డిగ్రీలు వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)పూర్వ డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య జయంత్ ఎం.మోదక్ అన్నారు.
ఆచార్య జయంత్ ఎం.మోదక్
గైట్ అటానమస్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
రాజానగరం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): డిగ్రీలు వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ)పూర్వ డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య జయంత్ ఎం.మోదక్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీజీయూ ప్రాంగణంలోని గైట్ అటానమస్ కళాశాలలో శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే-2025 వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉన్నత విద్యనభ్యసించే వారి శాతాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జీజీయూ చాన్సలర్ చైతన్యరాజు, ప్రో చాన్సలర్ కె.శశికిరణ్ వర్మ, ఉపకులపతి యు.చంద్రశేఖర్, ప్రో వైస్ చాన్సలర్ కేవీబీ రాజు తదితరులు పాల్గొన్నారు.