Higher Education Council: డిగ్రీ సీట్ల కేటాయింపు వాయిదా
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:13 AM
విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లు సరిపోలలేదనే కారణంతో ఉన్నత విద్యామండలి డిగ్రీ సీట్ల కేటాయింపును వాయిదా వేసింది.
సర్టిఫికెట్ల అప్‌లోడ్‌లో తకరారు... రేపటివరకు అవకాశం
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లు సరిపోలలేదనే కారణంతో ఉన్నత విద్యామండలి డిగ్రీ సీట్ల కేటాయింపును వాయిదా వేసింది. షెడ్యూలు ప్రకారం సోమవారం సీట్లు కేటాయించాలి. అయితే ఇంకా అనేక మంది విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉన్నట్లు గుర్తించింది. కొందరు సర్టిఫికెట్లకు బదులుగా ఇతరత్రా పత్రాలు అప్‌లోడ్ చేశారు. ఇలాంటి వారు వేలల్లో ఉన్నట్లు మండలి గుర్తించింది. దీంతో వారికి మరో అవకాశం కల్పిస్తూ సీట్ల కేటాయింపును 10 వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.