Higher Education: డిగ్రీపై ఎవరి దారి వారిదే
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:55 AM
ఉన్నత విద్యాశాఖలో విభేదాలు బయటపడుతున్నాయి. స్వయంగా నారా లోకేశ్ మంత్రిగా ఉన్న శాఖలోనే అధికారుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ముఖ్యంగా సాధారణ డిగ్రీ కోర్సుల విషయంలో...
ఉన్నత విద్యాశాఖ వర్సెస్ విద్యామండలి.. సింగిల్ మేజర్‌కు ఉన్నతాధికారుల పట్టు
డ్యూయల్ మేజర్‌కు మండలి మొగ్గు.. 2 మేజర్ సబ్జెక్టులు ఉండాలని లేఖ
డ్యూయల్‌కే ఎక్కువ మంది డిమాండ్.. అధ్యాపకులు, విద్యార్థులు, కాలేజీలూ దీనికే మొగ్గు
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖలో విభేదాలు బయటపడుతున్నాయి. స్వయంగా నారా లోకేశ్ మంత్రిగా ఉన్న శాఖలోనే అధికారుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ముఖ్యంగా సాధారణ డిగ్రీ కోర్సుల విషయంలో అభిప్రాయ భేదాలు పెరిగిపోతున్నా యి. డ్యూయల్ మేజర్ సబ్జెక్టులతో(రెండు ప్రధాన సబ్జెక్టులు) డిగ్రీ కోర్సులు ఉండాలని ఉన్నత విద్యామండలి మొదటినుంచీ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్ విధానానికి మారేందుకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది. కానీ ఉన్నత విద్యాశాఖలోని ఉన్నతాధికారులు సింగిల్ మేజర్ డిగ్రీ ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మంత్రి వద్ద జరిగిన సమీక్షలో దీనిపై చర్చ జరిగింది. సింగిల్ మేజర్ డిగ్రీ విధానమే కొనసాగించాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచి ్చనట్లు తెలిసింది. ఆ వెంటనే డిగ్రీపై మళ్లీ కొత్త క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించి పంపాలని ఉన్నత విద్యాశాఖ... మండలిని కోరింది. తాజాగా మండలి కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రభుత్వానికి పంపింది. అందులో రెండు మేజర్ సబ్జెక్టుల డిగ్రీనే మళ్లీ ప్రతిపాదించారు. మొదటి మేజర్ సబ్జెక్టుకు 60 క్రెడిట్లు, రెండో మేజర్ సబ్జెక్టుకు 48 క్రెడిట్లు, ఇంటర్న్‌షి్‌పలకు 8 క్రెడిట్లు పెట్టాలని సూచించింది.
మిగిలిన భాషా, మల్టీ డిసిప్లినరీ, స్కిల్ కోర్సులకు 10 క్రెడిట్లు మాత్రమే మిగులుతున్నాయి. అయితే సింగిల్ మేజర్‌తోనే డిగ్రీ ఉండాలని ఉన్నతాధికారులు పట్టుబడుతున్నారు. డ్యూయల్ మేజర్ విధానం సక్రమంగా లేదని అభిప్రాయపడుతున్నారు. ఒక మేజర్ సబ్జెక్టును, ఒక ఎలెక్టివ్ సబ్జెక్టు ఉండేలా కొత్త విధానం ఉండాలని భావిస్తున్నారు. భాషా, స్కిల్ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి అభిప్రాయం. దానివల్ల విద్యార్థులకు ఎక్కు వ మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్‌తో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని మం డలి అభిప్రాయపడుతోంది. సింగిల్ మేజర్ విధానంలో ఒకమేజర్, ఒకమైనర్ ఉంటాయి. ఆరెండింటిపైనే పీజీ చేసే అవకాశం ఉంటుంది. అదే డ్యూయల్ మేజ ర్ అమలుచేస్తే మొత్తం మూడు సబ్జెక్టులపై పీజీ చే యొచ్చు. క్షేత్రస్థాయిలో అధ్యాపకులు, విద్యార్థులు కూ డా డ్యూయల్ మేజర్‌డిగ్రీ విధానాన్నే కోరుకుంటున్నా రు. కాలేజీల యాజమాన్యాలూ డ్యూయల్ డిగ్రీ ఉండాలని అడుగుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నత విద్యాశాఖ సింగిల్ మేజర్‌కు మొగ్గు చూపుతుందనే వాదన వినిపిస్తోంది.