Higher Education Council: డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు రేపటి వరకు పెంపు
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:10 AM
డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. రిజిస్ర్టేషన్ గడువు సోమవారంతో ముగియగా బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. రిజిస్ర్టేషన్ గడువు సోమవారంతో ముగియగా బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 4 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక, 5న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది. 8న సీట్లు కేటాయిస్తారు. కాగా, డిగ్రీ కోర్సులకు ఇప్పటి వరకు 1,61,227 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారని, వారిలో 1,58,566 మంది కౌన్సెలింగ్ ఫీజు చెల్లించారని, 1,38,558 మంది దరఖాస్తులు సమర్పించారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీఎస్ కృష్ణమూర్తి చెప్పారు