Share News

Higher Education Council: డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:31 AM

డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మొదటి షెడ్యూలు ప్రకారం మంగళవారంతో రిజిస్ర్టేషన్ల గడువు ముగియనుంది.

Higher Education Council: డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మొదటి షెడ్యూలు ప్రకారం మంగళవారంతో రిజిస్ర్టేషన్ల గడువు ముగియనుంది. అయితే ఇంకా చాలా మంది విద్యార్థులు నమోదు చేసుకోకపోవడంంతో గడువును పొడించింది. సవరణ షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 1 వరకు విద్యార్థులు రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. 2వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు గడువు ఉంది. 6న సీట్లు కేటాయింపు జరుగుతుంది. 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Updated Date - Aug 27 , 2025 | 06:33 AM