Share News

ఫిరాయింపుల చట్టంలోనే లొసుగులు: యనమల

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:50 AM

తెలంగాణ స్పీకర్‌ ముందున్న అనర్హత పిటిషన్లను 3నెలల్లోగా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు తీర్పును టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు.

ఫిరాయింపుల చట్టంలోనే లొసుగులు: యనమల

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్పీకర్‌ ముందున్న అనర్హత పిటిషన్లను 3నెలల్లోగా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు తీర్పును టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనే అనేక లొసుగులు ఉన్నాయని, వీటిని సమీక్షించి చట్టసవరణ ద్వారా సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్‌ ముందు దాఖలైన పిటిషన్లను పరిష్కరించడానికి ఎటువంటి కాలపరిమితీ లేదని, సభాపతి నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 06:50 AM