ఆర్యవైశ్యమహిళలచే వైభవంగా దీపోత్సవం
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:01 AM
వాసవీ కన్యకాపరమేశ్వరి దే వస్థానంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవి తి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆర్యవైశ్య మహిళలచే వైభవంగా దీపోత్సవం నిర్వహించారు.
పోరుమామిళ్ల, ఆగస్టు 28 (ఆంధ్ర జ్యోతి) :వాసవీ కన్యకాపరమేశ్వరి దే వస్థానంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవి తి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆర్యవైశ్య మహిళలచే వైభవంగా దీపోత్సవం నిర్వహించారు. అభ యాంజనేయస్వామి ఆలయం నుంచి దీపాలతో ఊరేగింపుగా వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో గల వినాయక మండపానికి వెళ్లి దీపాలతో వినాయక అలంకారంచేశారు.