బార్లకు నేటితో గడువు పూర్తి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:00 AM
ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో బార్ల వ్యాపారుల్లో గుబులు రేపింది. ఈనెల 18 నుంచి ఽ26వ తేదీ వరకు జిల్లాలోని జనరల్ -19, కల్లు గీత కార్మికులు-2 చొప్పున మొత్తంగా 21 బార్లకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు.
నంద్యాల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో బార్ల వ్యాపారుల్లో గుబులు రేపింది. ఈనెల 18 నుంచి ఽ26వ తేదీ వరకు జిల్లాలోని జనరల్ -19, కల్లు గీత కార్మికులు-2 చొప్పున మొత్తంగా 21 బార్లకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఇప్పటివరకు జిల్లాలో జనరల్ -19 బార్లకు జిల్లా వ్యాప్తంగా 41 మంది ఆనలైన రిజిస్ట్రేషన చేసుకున్నారు. కానీ టెండర్ మాత్రమే ఒక్కటే దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఆఖరిరోజు కావడంతో భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇప్పటి వరకు 41 మంది రిజిస్ట్రేషన చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. వీటిలో నంద్యాల-24, నందికొట్కూరు-5, ఆళ్లగడ్డ-1, డోన-2, బేతంచెర్ల-3, ఆత్మకూరు-5, నంద్యాల-1 ఉన్నట్లు తెలిపారు.