గుండెపోటుతో డీఈ ఉమాకాంతరెడ్డి మృతి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:41 PM
ఆత్మకూరు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఉమాకాంతరెడ్డి (56) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు.
ఆత్మకూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఉమాకాంతరెడ్డి (56) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. వివరాలిలా.. ఉయ్యాలవాడ మండలంలోని ఇంజేడు గ్రామానికి చెందిన డీఈ ఉమాకాంతరెడ్డి కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం ఆత్మకూరుకు బదిలీపై రావడంతో పట్టణంలోని స్వరాజ్‌నగర్‌లో ఆయనొక్కరే నివాసం ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి అనారోగ్యంగా ఉందని, సహచర సిబ్బందికి తెలిపాడు. ఆంబులెన్సలో కర్నూలుకు తీసుకెళ్తుండగానే కరివేన సమీపంలో గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని కర్నూలులోని స్వగృహానికి తరలించారు. భార్య కళావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఉమాకాంతరెడ్డి మృతిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.