నేడు డీడీఓ కార్యాలయం ప్రారంభం
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:34 PM
జిల్లా పరిషత ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నారు.
చిత్తూరు నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత ఆవరణలో పాత జిల్లా పరిషత భవనాన్ని ఇటీవల సుమారు రూ.15 లక్షలతో మరమ్మతు చేశారు. కొత్త హంగులు, అత్యాధునిక సాంకేతికతతో కార్యాలయాన్ని రూపొందించారు. డీడీఓ కార్యాలయంలో ఎల్‌ఈడీ స్ర్కీన ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. పంచాయతీరాజ్ సంస్కరణలో భాగంగా ఈ కార్యాలయ ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డీడీఓ పోస్టులను గ్రామీణాభివృద్ధిలో అత్యంత కీలకంగా శాఖ భావిస్తోంది. డివిజన స్థాయిలో ఈ కార్యాలయాలు మినీ కలెక్టరేట్‌గా ప్రజలకు సేవలు అందించనున్నాయి. డివిజన స్థాయిలోని డివిజన పంచాయతీ కార్యాలయం, డ్వామా ఏపీడీ కార్యాలయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన డివిజనకు సంబంధించిన కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. డ్వామా ఏపీడీలు, డివిజనల్ పంచాయతీ అధికారులు డీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహించాలి.