Cooperative Banks: డీసీసీబీ డైరెక్టర్ పోస్టుల భర్తీ ఎప్పుడో
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:19 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లలో డైరెక్టర్ పదవుల కోసం కూటమి పార్టీల ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
కూటమి పార్టీల నుంచి ఆశావహుల ఎదురుచూపు
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎ్‌స)లలో డైరెక్టర్ పదవుల కోసం కూటమి పార్టీల ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మూడు నెలల క్రితం నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఉన్న ఈ రెండింటిలో అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి(చైర్మన్)లను మాత్రమే ప్రభుత్వం నియమించింది. అధికారికంగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. డీసీసీబీ, డీసీఎంఎ్‌సల్లో ఏడు చొప్పున డైరెక్టర్ పోస్టులను నియమించుకునే అవకాశం ఉన్నందున కొందరు నేతలు ఈ పదవులు ఆశిస్తున్నారు. కాగా, ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్)కు గత మేలో అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి(చైర్మన్)లను నామినేట్ చేసిన ప్రభుత్వం, ఇంకా డైరెక్టర్లను నియమించలేదు. ఇప్పుడు డైరెక్టర్లుగా ఏడుగురిని నియమించుకునే వెసులుబాటు ఉందని చెప్తున్నారు. కాగా, గత ప్రభుత్వం డైరెక్టర్లు లేకుండా అధికారేతర పర్సన్ ఇన్‌చార్జితోనే కాలం గడిపింది.