Final Rites: కొడుకై నిలిచిన కోడలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 07:04 AM
భర్త, కుమారుడు దూరమైన ఆమెకు ఇన్నాళ్లూ కోడలే సర్వస్వం అయింది...బాగోగులు చూసింది.
చితికి నిప్పుపెట్టి అంతిమ సంస్కారాలు
ముమ్మిడివరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): భర్త, కుమారుడు దూరమైన ఆమెకు ఇన్నాళ్లూ కోడలే సర్వస్వం అయింది...బాగోగులు చూసింది. చివరకు ఆమె చనిపోగా...మగదిక్కు లేకపోవడంతో ఆ కోడలే తలకొరివిపెట్టి అంతిమసంస్కారాలు నిర్వహించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త మరణించాడు. ఆమె కుమారుడు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కోడలు శ్రీదేవి, నాలుగేళ్ల మనవడు, ఏడేళ్ల మనవరాలితో కలిసి ఆదిలక్ష్మి ఉంటోంది. కాగా, ఆదిలక్ష్మి ఆదివారం అకస్మాత్తుగా మృతి చెందగా, ఎవరూ లేకపోవడంతో శ్రీదేవే అత్త చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన స్థానికుల హృదయాలను కదిలించింది.