Share News

Sharannavaratri Festival: బెజవాడలో దసరా సందడి

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:56 AM

బెజవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒకవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర...

Sharannavaratri Festival: బెజవాడలో దసరా సందడి

ఇంటర్నెట్ డెస్క్: బెజవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒకవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు, మరోవైపు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్పంచుకుంటున్నారు. శుక్రవారం ఐదోరోజు దుర్గమ్మ శ్రీమహాలక్ష్మి రూపంలో భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం దుర్గా ఘాట్‌ వద్ద కృష్ణా నవ హారతిని తిలకించడానికి వచ్చిన భక్తులు జయజయధ్వానాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. బెజవాడలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికలు భక్తులతో కళకళలాడాయి. పున్నమి ఘాట్‌ వద్ద సాంస్కృతిక సంబరాలు అంబరాన్ని తాకాయి. భవానీ మాలధారుల ప్రత్యేక దాండియా కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. చిన్నాపెద్దా కలిసి సందడి చేశారు.

Updated Date - Sep 27 , 2025 | 04:57 AM