ప్రమాదకరంగా లోతట్టు వంతెనలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:43 PM
ప్రతియేటా వర్షాకాలం లో లోతట్టు వంతెనలపై వరద నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
వరద వస్తే తప్పని కష్టాలు
ఏళ్ల నుంచి ఇబ్బందులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
చాగలమర్రి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతియేటా వర్షాకాలం లో లోతట్టు వంతెనలపై వరద నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. వరద వచ్చిన ప్రతిసారీ రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆ సమయంలో ఆయా గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లె, కలుగొట్లపల్లె గ్రామాల సమీపంలో వక్కిలేరుపై లో లెవల్ వం తెనలు ఉన్నాయి. యేటా వర్షాలకు వరద నీరు వంతెన ఎక్కి పారుతోంది. దాంతో రాకపోకలకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలు కూడా నీట మునుగుతున్నా యి. ఆయా గ్రామస్థులు గొట్లూరు గ్రా మానికి చేరుకొని అక్కడి నుంచి వాహ నాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు వె ళ్లాల్సి వస్తోంది. ఈ స్థితి 26 ఏళ్ల నుం చి ఉన్నది. కలుగొట్లపల్లె గ్రామంలో 100 కుటుంబాలు, బ్రాహ్మణపల్లెలో సుమారు 200 కుటుంబాలు ఉన్నాయి. 1,500 మంది దాకా జనాభా ఉన్నారు. లోతట్టు వంతెనలు కావడంతో ఏడాది లో కనీసం ఐదుసార్లు వరద కష్టాలు తప్పడం లేదు. బ్రాహ్మణపల్లె నుంచి గొట్లూరు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, నేలవంతెనలను తొలగిం చి హైలెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఏళ్ల నుంచి కోరుతున్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి హైలెవల్ వంతెనలు నిర్మిం చాలని కోరుతున్నారు.
ప్రాణాలు పోతున్నాయి
వక్కిలేరు పొంగినప్పుడు అనారోగ్యానికి గురైతే వైద్యం అందే పరిస్థితి లేదు. ఊరు దాటే వీలు లేకపోవడంతో ప్రా ణాలు పోతున్నాయి. ప్రతి ఏడాది వర్షాలు పడితే వంతె నపై రాకపోకలు స్తంభించిపోతాయి. వరద నీటిలో రాకపోకలు చేయలేక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి హైలెవెల్ వంతెన నిర్మించాలి.
- భాస్కర్‌రెడ్డి, రైతు, బ్రాహ్మణపల్లె గ్రామం
వరద వస్తే కష్టాలు
వరద వచ్చిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నాం. వక్కిలేరు పొంగితే రాకపోకలు ఉండవు. అత్యవసరమైతే పక్క గ్రామాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. లోతట్టు వంతెన కావడంతో వరద వచ్చినప్పుడల్లా రాకపోకలు సాగించ లేకపోతున్నాం. వరద వచ్చిన సమయంలో వారం రోజుల పాటు కష్టాలు తప్పవు. పాలకులు, అధికారులు స్పందించి హైలెవెల్ వంతన నిర్మాణం చేపట్టాలి.
- రాజేష్, యువకుడు, కలుగొట్లపల్లె గ్రామం