Vimala Memorial Literary Award: దళిత ఉద్యమ పతాక కత్తి పద్మారావు
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:12 AM
సాహితీవేత్త డాక్టర్ కత్తి పద్మారావు దళిత ఉద్యమ పతాక అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు...
కత్తి చేతన్‌కు విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం అందజేత
అనంతపురం టౌన్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సాహితీవేత్త డాక్టర్ కత్తి పద్మారావు దళిత ఉద్యమ పతాక అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. 2025 సంవత్సరానికిగాను డాక్టర్ కత్తి పద్మారావును విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురంలోని ఎస్‌ఎ్‌సబీఎన్ కళాశాలలో విమలాశాంతి సాహిత్య సామాజిక సేవాసమితి ఆదివారం నిర్వహించిన పురస్కార సభకు అనివార్య కారణాల వల్ల కత్తి పద్మారావు హాజరుకాలేదు. దీంతో ఆయన కుమారుడు కత్తి చేతన్ హాజరై పురస్కారాన్ని అందుకున్నారు. సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శాంతినారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డితోపాటు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి హాజరై.. కత్తి చేతన్‌కు పురస్కారం ప్రదానం చేసి, సత్కరించారు.