Share News

ప్రోత్సాహకాలు చెల్లించాలి: దళిత పారిశ్రామికవేత్తలు

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:45 AM

దళిత పారిశ్రామికవేత్తలు సోమవారం ఏపీఐఐసీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగారు.

ప్రోత్సాహకాలు చెల్లించాలి: దళిత పారిశ్రామికవేత్తలు

అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దళిత పారిశ్రామికవేత్తలు సోమవారం ఏపీఐఐసీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పరిశ్రమల శాఖ అధికారుల వివక్షను నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసినా... పారిశ్రామిక పోత్సాహకాల సొమ్మును తమకు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన గేటు, భవన ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోత్సాహకాలు చెల్లించేవరకూ కదిలేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలశాఖ అడిషనల్‌ డైరెక్టరు రామలింగరాజుతో చర్చలు జరిపారు. ప్రోత్సాహకాలు చెల్లించేవరకూ ఏపీఐఐసీ వద్దే ఆందోళన కొనసాగిస్తామని తెగేసి చెప్పారు. కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నాయకులు నాయకత్వం వహించారు.

Updated Date - Dec 09 , 2025 | 05:46 AM