Judicial Magistrate: నకిలీ మద్యం కేసులో కస్టడీ పిటిషన్లపై 8న తీర్పు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:28 AM
నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్ ఖైదీలను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు...
విజయవాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్ ఖైదీలను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 8న తీర్పు ఇవ్వనుంది. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న బాదల్ దాస్(ఏ7), ప్రదీప్ దాస్(ఏ8), డి.శ్రీనివాస్ రెడ్డి(ఏ11), ఏ.కల్యాణ్(12), టి.రమేశ్ బాబు(ఏ15), అల్లాభక్ష్ (ఏ16), చెక్కా సతీశ్ కుమార్(ఏ17)ను ఇప్పటికే సిట్ విచారణ చేసింది. వారిని రెండోసారి వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. వారితో పాటు సయ్యద్ హజీ(ఏ5), కట్టా రాజు(ఏ6), మిథున్ దాస్(ఏ9), అంతాదా్‌స(ఏ10)లను కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటిపై వాదప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి జి.లెనిన్‌బాబు 8న తీర్పును వెలువరిస్తానని తెలిపారు.