Postponed: కిలేడీ కస్టడీ పిటిషన్ నేటికి వాయిదా
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:16 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి విజయవాడకు చెందిన వృద్ధుడి దగ్గర నుంచి రూ.లక్షలు వసూలు...
విజయవాడ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి విజయవాడకు చెందిన వృద్ధుడి దగ్గర నుంచి రూ.లక్షలు వసూలు చేసిన కి‘లేడీ’ నిడిగుంట అరుణ కస్టడీ పిటిషన్‌ను ఒకటో ఏసీఎంఎం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం జరిగిన విచారణకు ఆమె తరఫున న్యాయవాది హాజరై వాదనలను రాతపూర్వకంగా తెలియజేస్తానని చెప్పారు. దీంతో కోర్టు మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. అరుణను విచారించడానికి రెండు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సూర్యరావుపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.