Vijayawada: మొదటికొచ్చిన మావోయిస్టుల కస్టడీ
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:36 AM
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు, విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో అరెస్టు అయిన మావోయిస్టుల కస్టడీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
విజయవాడ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు, విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో అరెస్టు అయిన మావోయిస్టుల కస్టడీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. న్యాయపరిధి విషయంలో గందరగోళమే దీనికి కారణమని తెలుస్తోంది. పెనమలూరు పోలీసులు ముగ్గురిని, పటమట పోలీసులు నలుగురు మావోయిస్టులను కస్టడీకి ఇవ్వాలంటూ సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, తమకు ఆ అధికారం లేదని, జిల్లా కోర్టును ఆశ్రయించాలని సూచించాయి. దీంతో జిల్లా కోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. జిల్లా కోర్టు వాటిని తిరస్కరిస్తూ, సంబంధిత కోర్టుల్లోనే పిటిషన్లు దాఖలుచేయాలని సూచించింది. దీంతో విజయవాడ నాలుగు, ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్‌మేజిస్ట్రేట్ కోర్టుల్లో పిటిషన్లు వేశారు.
మావోయిస్టు మృతులు 18 మంది..: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 18కి పెరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు, పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తొలుత పోలీసులు భావించారు.