Share News

Raghurama Krishnam Raju: నేరం ఇక్కడైతే.. బిహార్‌ హైకోర్టులో స్టే!

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:58 AM

తనను అక్రమంగా లాక్‌పలో పెట్టి కస్టోడియల్‌ హింసకు గురి చేసింది ఏపీలో అయితే.. నాటి సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ సంబంధంలేని బిహార్‌....

Raghurama Krishnam Raju: నేరం ఇక్కడైతే.. బిహార్‌ హైకోర్టులో స్టే!

  • నా అరెస్టులో సునీల్‌ కుమార్‌ కీలక పాత్ర

  • కస్టోడియల్‌ హింస కేసులో అరెస్టు నుంచి బిహార్‌ హైకోర్టు నుంచి రక్షణ పొందారు

  • స్టే రద్దుకు నేను ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశా

  • డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు

గుంటూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తనను అక్రమంగా లాక్‌పలో పెట్టి కస్టోడియల్‌ హింసకు గురి చేసింది ఏపీలో అయితే.. నాటి సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ సంబంధంలేని బిహార్‌ హైకోర్టులో అరెస్టు నుంచి స్టే తెచ్చుకున్నారని ఆ కేసు బాధితుడు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌తో పాటు సునీల్‌కుమార్‌ తనను అరెస్టు చేసిన సమయంలో అక్కడే ఉన్నారన్నారు. తన అరెస్టులో సునీల్‌ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం ఆయన బిహార్‌ పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి హైకోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేసి, అరెస్టు నుంచి స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆ స్టేను రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన కౌంటర్‌లో తాను కూడా ఇంప్ల్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. స్టేను రద్దు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.

60 రోజులు సభకు రాకుంటే సభ్యత్వం రద్దు

కాగా, ఎవరైనా ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దయిపోతుందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మరోమారు స్పష్టం చేశారు.

Updated Date - Oct 05 , 2025 | 03:58 AM