ACB DG Atul Singh: అవినీతి కట్టడి అందరి బాధ్యత
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:45 AM
అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) అతుల్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం నుంచి నవంబరు 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
ఏసీబీ డీజీ అతుల్ సింగ్.. విజిలెన్స్ వారోత్సవాలు ప్రారంభం
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) అతుల్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం నుంచి నవంబరు 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను విజయవాడ నుంచి వర్చువల్‌గా ఆయన 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సోమవారం ప్రారంభించారు. ‘విజిలెన్స్ అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఏసీబీ సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి అవగాహన పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అవినీతి నిర్మూలనకు విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతిజ్ఞలు చేయించాలన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీజీ అతుల్ సింగ్ తెలిపారు. లంచాల కోసం ఎవరు పీడించినా ఏసీబీకి సమాచారం ఇవ్వాలన్నారు.