Share News

Chief Secretary Extension: మరో 3 నెలలు విజయానందే!

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:10 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సర్వీసును మరో 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

Chief Secretary Extension: మరో 3 నెలలు విజయానందే!

  • సీఎస్‌గా కొనసాగింపునకు సీఎం నిర్ణయం

  • ఫిబ్రవరి తర్వాత సాయిప్రసాద్‌కు చాన్సు

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సర్వీసును మరో 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు కేంద్రం అనుమతి తీసుకోనున్నారు.. విజయానంద్‌ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మరో 3నెలలు ఆయన్నే సీఎస్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పొడిగింపుతో విజయానంద్‌ వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగుతారు. ఆ తర్వాత జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను సీఎస్‌గా నియమించాలని సీఎం భావిస్తున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 04:11 AM