CS Vijayanand: ప్రజా భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వండి
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:12 AM
మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు.
విద్యుత్ పునరుద్ధరణకు పూర్తి ఏర్పాట్లు చేసుకోండి: సీఎస్
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు అంతరా యం తలెత్తిన వెంటనే తక్షణమే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ప్రజాభద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, కంట్రోల్ రూము లు, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణతో విద్యుత్ సిబ్బం ది పనిచేయాలని కోరారు. కాగా, రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లలో అత్యవసర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని జెన్కో ఎండీ నాగలక్ష్మి సీఎ్‌సకు తెలిపారు. విశాఖ, విజయవాడ జోన్లలోని 8 జిల్లాల్లో పునరుద్ధరణకు కావాల్సిన సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని ట్రాన్స్‌కో జెఎండీ ప్రవీణ్ చంద్ తెలిపారు. ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజ మాట్లాడుతూ... తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, వేగవంతమైన పునరుద్ధరణకు విస్తృత ఏర్పా ట్లు చేశామని తెలిపారు. 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.