CS Vijayanand: ప్రైవేట్ ఆలయాల్లో రద్దీకి తగ్గట్లు బందోబస్తు ఉండాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:07 AM
రాబోయే పండుగల సీజన్‌లో రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీ, బందోబస్తు విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు
అధికారులకు సీఎస్ విజయానంద్ ఆదేశం
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాబోయే పండుగల సీజన్‌లో రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీ, బందోబస్తు విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎ్‌సలో సోమవారం జరిగిన సమీక్షలో పలు ఆదేశాలు ఇచ్చారు. ‘‘వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం తదితర పర్వదినాలు, పండుగల రోజుల్లో ఆలయాల్లో భక్తుల రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల విషయంలో నిబంధనావళి రూపొందించి అన్ని ప్రైవేటు ఆలయాలకు జారీ చేయాలి. ప్రైవే టు ఆలయాలు మీ పరిధికాదనే నిర్లక్ష్యం వద్దు. జిల్లాల్లో అధికారులు తమ పరిధిలోని ప్రైవేటు ఆలయాల పర్యవేక్షణపైన కూడా దృష్టి పెట్టాలి. రద్దీ నియంత్రణకు పోలీసుల అనుమతి తీసుకుని, తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసేలా చూడాలి. తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా చూడాలి’’ అని ఆదేశించారు.