Share News

విద్యుత్‌ కొనుగోళ్లలో వ్యూహాలు పాటించండి: సీఎస్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:08 AM

విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో విద్యుత్‌ సంస్థలు ఆర్థిక పరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో వ్యూహాలు పాటించండి: సీఎస్‌

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో విద్యుత్‌ సంస్థలు ఆర్థిక పరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు. ఈ ఏడాది నవంబరులో విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి విద్యుత్‌ సంస్థలతో గురువారం సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లలో సమర్థవంతమైన ఆర్థికవ్యూహాలు పాటించాలని నిర్దేశించారు. నవంబరుకు 213 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులో ఉందని, గ్రిడ్‌ డిమాండ్‌ 218 మిలియన్‌ యూనిట్లుగా అంచనా వేశామని సీఎస్‌ తెలిపారు. రోజువారీ డిమాండ్‌ తీర్చడంలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి 70 మెగావాట్ల నుంచి 1870 మెగావాట్లు, పవన విద్యుత్‌ 90 మెగావాట్ల నుంచి 400 మెగావాట్ల మధ్య ఉండబోతోందని చెప్పారు.

Updated Date - Oct 24 , 2025 | 05:09 AM