Share News

మంత్రాలయంలో భక్తుల సందడి

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:41 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది.

మంత్రాలయంలో భక్తుల సందడి
భక్తులతో రద్దీగా ఉన్న శ్రీమఠం

మంత్రాలయం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది. గురువారం రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన దినం కావ టంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంరఽధా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహా రాష్ట్ర నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాముఖద్వారం, మద్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదీతీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను భక్తులు దర్శించుకున్నారు. ఏకాదశి కావటంతో అన్నదానం, రథాల ఊరేగింపు, పూజలు, టెంకాయకొట్టడం, పరిమళ ప్రసాదం లేకపోవడంతో భక్తులు నిరాశ చెందారు.

Updated Date - Apr 24 , 2025 | 11:41 PM