Minister Ambati: మాజీ మంత్రి అంబటిపై కేసు
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:25 AM
ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందంటూ ఫేక్ వీడియోలతో తప్పుడు..
గుంటూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందంటూ ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీ్‌సస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ప్రజలను మోసం చేయడానికి, వివిధ రాజకీయ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం, అనైతిక భావాలను సృష్టించడానికి ఉద్దేశించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.