Rayapati Shailaja: ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించం
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:28 AM
రాష్ట్రంలో ఎక్కడైనా ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది...
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
అనంతపురం, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఎక్కడైనా ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది’ అని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. గురువారం ఆమె అనంతపురం పర్యటనకు వచ్చారు. హత్యకు గురైన విద్యార్థిని తన్మయి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందనీ, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలిని అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఆమె పరామర్శించి, ఓదార్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనల్లో నిందితులందరికీ కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.