Share News

Chalo Vijayawada: సెప్టెంబరు 1న చలో విజయవాడ

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:24 AM

సీపీఎస్‌ ఉద్యోగులకు బ్లాక్‌ డే అయున సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమానికి ఏపీసీపీఎ్‌సఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీశ్‌, సీఎం దాస్‌ పిలుపునిచ్చారు.

Chalo Vijayawada: సెప్టెంబరు 1న చలో విజయవాడ

అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ ఉద్యోగులకు బ్లాక్‌ డే అయున సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమానికి ఏపీసీపీఎ్‌సఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీశ్‌, సీఎం దాస్‌ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్‌ విధానాన్ని నిలుపుదల చేసినందుకు బుధవారం ఒక ప్రకటనలో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒక సంవత్సరంలోపు పరిష్కారం చూపిస్తామని ప్రకటించారని, కానీ సంవత్సరం గడిచినా సీపీఎస్‌ విధానంపై కనీస చర్చ కూడా జరగలేదన్నారు. ప్రభుత్వం ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు.

Updated Date - Jun 05 , 2025 | 05:24 AM