Polavaram project: పోలవరం పునరావాస ప్యాకేజీ అందించాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:40 AM
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ(ఆర్‌అండ్‌ఆర్) అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ఆంధ్రప్రదేశ్ సీపీఎం కమిటీ కోరింది..
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సీపీఎం వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ(ఆర్‌అండ్‌ఆర్) అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ఆంధ్రప్రదేశ్ సీపీఎం కమిటీ కోరింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బిట్రాస్ నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, లోకనాథం, కె.సురేంద్ర, బి.కిరణ్, డి.రమేష్ కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం.. ఏపీ భవన్‌లో వారు మాట్లాడుతూ పోలవరం డీపీఆర్ సమయంలో నిర్వాసితులకు రూ.33 వేలకోట్ల ప్యాకేజీ అందించాల్సి ఉంటుందని అంచనా వేశారని, కానీ ఇప్పటి వరకు కేవలం రూ.5,200 కోట్లు మాత్రమే అందించారని తెలిపారు. ఇటీవల మరో రూ.824కోట్లు మంజూరైనా, ఆ నిధుల్లో ఎక్కువ భాగం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కలుగజేసుకుని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందేలా చూడాలని కోరారు.