Share News

CPI K. Narayana: టీటీడీని రాజకీయ లబ్ధికి వాడొద్దు: నారాయణ

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:06 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, గవర్నర్ల వ్యవస్థను రద్దుచేసి చట్టసభలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండు చేశారు. ఆయన తిరుపతిలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసారు.

CPI K. Narayana: టీటీడీని రాజకీయ లబ్ధికి వాడొద్దు: నారాయణ

తిరుపతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): దేశంలో గవర్నర్ల వ్యవస్థను రద్దుచేసి చట్టసభలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం ఆయన అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. ‘అంబేడ్కర్‌ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం గండి కొడుతోంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పోరాటాలు చేస్తాం. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులను బీజేపీ ఖాతరు చేయడం లేదు. చట్టసభలపైన కోర్టుల జ్యోక్యం పెరిగిందని గవర్నర్లు వాఖ్యానించడం సిగ్గుచేటు. మావోయిస్టుల ఏరివేత పేరుతో అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్రం కుట్ర పన్నుతోంది. ఇటీవల టీటీడీపై దుష్ప్రచారం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఈ కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. టీటీడీని రాజకీయ లబ్ధి కోసం వాడుకోరాదు’ అని నారాయణ హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:06 AM