CPI National Secretary K. Narayana: జగన్, అమిత్‌షా సలహా తీసుకున్నాడేమో!
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:51 AM
‘మాజీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారు.
వివేకా హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారు: నారాయణ
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై పెట్టిన కేసుల్లో కూడా లాయర్, 12 మంది సాక్షులను చంపేశారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘జగన్.. అమిత్‌షాను కలిసి సలహా తీసుకుని ఉంటాడనిపిస్తోంది. సాక్షులను మాయం చేసినంత మాత్రాన నేరస్థులు కారా? టెక్నికల్‌గా తప్పించుకున్నా... ఆచరణ రీత్యా ముద్దాయే.
తాను పవిత్రుడినని మోదీ అనుకుంటే సరిపోదు’’ అని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ, రాజధానికి కేంద్రం సహకారం ఉందో లేదో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.