CPI Narayana: అది దేవస్థానమా, శ్మశాన వాటికా
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:44 AM
కర్ణాటకలోని ధర్మస్థల ట్రస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. తమ కార్యాలయ ఉద్యోగి కుమార్తె వివాహానికి హాజరైన నారాయణ శనివారం ఉదయం...
ధర్మస్థల ట్రస్టుపై విరుచుకుపడిన సీపీఐ నారాయణ
తిరుమల, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ధర్మస్థల ట్రస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. తమ కార్యాలయ ఉద్యోగి కుమార్తె వివాహానికి హాజరైన నారాయణ శనివారం ఉదయం శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని సందర్శించారు. ధర్మస్థలలో మిస్టరీ మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల ట్రస్టు 60 నుంచి 70 ఏళ్లుగా ఓ కుటుంబం చేతిలోనే ఉందన్నారు. ఆ ట్రస్టుకు చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా కూడా బీజేపీ నామినేట్ చేసిందని పేర్కొన్నారు. అయితే 1980 నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేశారన్నారు. ఈ విషయాన్ని ఓ స్కావెంజర్ బయటపెట్డాడని, ప్రజలు ఆందోళన చేపట్టిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు సిట్ ఏర్పాటు చేసిందన్నారు. కాంపౌండ్ లోపల తవ్వే కొద్దీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయని, అది శ్మశాన వాటికా లేదా పవిత్రమైన దేవస్థానమా అంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.