Trending: సోషల్ మీడియాలో హిడ్మా ట్రెండింగ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:54 AM
మారేడుమిల్లి అడవుల్లో ఏపీ పోలీసుల చేతిలో హతమైన సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఇప్పుడు సోషల్ మీడియాలో...
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మారేడుమిల్లి అడవుల్లో ఏపీ పోలీసుల చేతిలో హతమైన సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఎన్‌కౌంటర్ తర్వాత విడుదలైన ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గడచిన ఐదు రోజులుగా ఎక్స్, ఫేస్‌బుక్, య్యూటూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హిడ్మా ట్రెండింగ్‌లో నిలిచారు. ఇక వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో హిడ్మా అమరుడంటూ, ఆయన ఆదివాసీల కోసం చేసిన త్యాగాలను కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు.