బీజేపీ, ఆరెస్సెస్‌లతో దేశానికి ముప్పు: సీపీఐ రాజా
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:37 AM
బీజేపీ, ఆరెస్సెస్‌ల మతోన్మాద విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): బీజేపీ, ఆరెస్సెస్‌ల మతోన్మాద విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఆ రెండు శక్తులూ కలిసి భారత్‌ను ఫాసిస్టు దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలు విస్మరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో నడుస్తున్నారని అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బిహార్ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని చెప్పారు. దేశంలోని అన్ని లౌకిక, ప్రజాస్వామిక పార్టీలతో కలిసి బీజేపీ, ఆరెస్సె్‌సలకు వ్యతిరేకంగా బలమైన ఐక్య పోరాటానికి సీపీఐ సన్నద్ధమవుతోందని రాజా తెలిపారు. ఈ నెల 25న ఢిల్లీలో నిర్వహించనున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయస్థాయి ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామన్నారు.