విద్యుత్, సీడ్ బిల్లులు ఉపసంహరించాలి: సీపీఐ
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:48 AM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు, సీడ్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి.
విజయవాడ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు, సీడ్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి. రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చట్టాలు తీసుకురావాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. రంగు మారిందని, తాలు, తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో వరి రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రి నాదెండ్ల పర్యటనలకే పరిమితమౌవుతున్నారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న అన్ని జిల్లా కేంద్రాలు, గుంటూరులోని సీసీఐ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించాలి’ అని ఈశ్వరయ్య, ప్రసాద్ పిలుపునిచ్చారు.