Share News

నూతన కౌలు చట్టాన్ని తేవాలి: సీపీఐ

ABN , Publish Date - May 09 , 2025 | 05:24 AM

కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం అవసరమని సీపీఐ పిలుపు. వ్యవసాయ రంగంలో స్థిరత్వం కోసం ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్

నూతన కౌలు చట్టాన్ని తేవాలి: సీపీఐ

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కౌలు రైతుల సంక్షేమం కోసం సమగమ్రైన నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని సీపీఐ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇతర నేతలు జల్లి విల్సన్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుని కలసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేయాలని, వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలకు అందించే పరిహారాన్ని పెంచాలని కోరారు. ‘అన్నదాత’ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఇంకా పలు అంశాలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆర్డీటీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - May 09 , 2025 | 05:24 AM