Share News

కులగణన తరువాతే స్థానిక ఎన్నికలు : సీపీఐ

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:57 AM

ఆంధ్రప్రదేశ్‌లో కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కులగణన తరువాతే స్థానిక ఎన్నికలు : సీపీఐ

గుంటూరు(తూర్పు), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనగణనలో కులగణన తక్షణమే చేపట్టాలని... బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు మల్లయ్యలింగంభవన్‌లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ కులగణన జరిగితే కులాల వారీగా జనాభా, సామాజిక స్థితిగతులు తెలుస్తాయని, తద్వారా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చని చెప్పారు.

Updated Date - Oct 08 , 2025 | 05:01 AM