CPI: స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:18 AM
పేదలు, రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండు చేశారు.
ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముట్టడిలో నారాయణ
తిరుపతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘పేదలు, రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండు చేశారు. తిరుపతిలోని ఏపీఎ్‌సపీడీసీఎల్ కార్యాలయాన్ని సోమవారం వామపక్ష నేతలు ముట్టడించారు. కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలోని విద్యుత్ ఒప్పందం వెనుక భారీ లంచాలు, దోపిడీ ఉన్నాయన్నారు. విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి, స్మార్ట్ మీటర్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు.