ప్రైవేటీకరణతో విద్య, వైద్య వ్యవస్థలు ఛిద్రం: సీపీఐ
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:20 AM
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానంతో విద్య, వైద్య వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య బుధవారం విమర్శించారు.
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానంతో విద్య, వైద్య వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య బుధవారం విమర్శించారు. శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యా వ్యవస్థను శాసించే స్థాయుకి చేరుకున్నాయన్నారు. పీపీపీ పద్ధతిలో 10 మెడికల్ కాలేజీలతోపాటు తొలివిడతగా 4 బోధనాస్పత్రులను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలిపారు. ప్రభుత్వ భూమి, వనరులు, భవనాల నిర్మాణం, సిబ్బంది నియామకం, జీతాల చెల్లింపుల ద్వారా వందల కోట్ల ప్రజాధానాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగిస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 107, 108జీవోలను రద్దు చేయాలని, పీపీపీ విధానానికి స్వస్తి పలికి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు.