5న విద్యుత్తు ఉద్యమానికి కదం తొక్కండి: సీపీఐ
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:15 AM
వామపక్షాలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వచ్చేనెల 5న అన్ని జిల్లాల్లో విద్యుత్తు కార్యాలయాల వద్ద తలపెట్టిన విద్యుత్తు ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు...
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): వామపక్షాలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వచ్చేనెల 5న అన్ని జిల్లాల్లో విద్యుత్తు కార్యాలయాల వద్ద తలపెట్టిన విద్యుత్తు ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమస్యపై వైసీపీ నోరు మెదపడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు అదానీతో ఒప్పందాలు చేసుకోవడమే దీనికి కారణమని ఆయన విమర్శించారు. విద్యుత్తు చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అదానీతో చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం దిగివచ్చేలా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని సోమవారం నిర్వహించిన జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.