Share News

Anantapur COVID case 2025: అనంతలో కొవిడ్‌ కేసు

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:04 AM

అనంతపురం జిల్లాలో కొవిడ్‌ కేసు నమోదైంది. అనంతపురం నగరంలోని పాతూరుకు చెందిన 30 ఏళ్ల మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టరు వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు.

Anantapur COVID case 2025: అనంతలో కొవిడ్‌ కేసు

30 ఏళ్ల మహిళకు పాజిటివ్‌

అనంతపురం టౌన్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో కొవిడ్‌ కేసు నమోదైంది. అనంతపురం నగరంలోని పాతూరుకు చెందిన 30 ఏళ్ల మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టరు వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. దగ్గు, ఆయాసం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం బుధవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేరాలని వైద్యులు సూచించారు. ఆమె నిరాకరించడంతో హోమ్‌ ఐసొలేషన్‌కు పంపించారు.

Updated Date - Jun 05 , 2025 | 06:55 AM