Share News

ACB Court: మద్యం స్కాం నిందితులకు కోర్టు ఝలక్‌

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:48 AM

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టయి విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చాణక్య దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టుకొట్టేసింది.

ACB Court: మద్యం స్కాం నిందితులకు కోర్టు ఝలక్‌

  • చాణక్య బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

  • రాజ్‌ కసిరెడ్డికి ఇంటిభోజనం నో

విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టయి విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చాణక్య దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టుకొట్టేసింది. చాణక్య బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. అలాగే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. జైలులో ఉన్న తనకు ఇంటి భోజనం అనుమతించడంతోపాటు సదుపాయాలు కల్పించాలని కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయాధికారి భాస్కరరావు సోమవారం కొట్టివేశారు. మరోవైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సిట్‌ పోలీసులు సోమవారం ఏసీబీ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలను పదో తేదీకి వాయిదా వేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - Jul 08 , 2025 | 04:50 AM