Share News

Penamaluru: పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు నోటీసులు

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:52 AM

కృష్ణా జిల్లా పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌ జె.వెంకటరమణ, ఎస్‌ఐలు రమేశ్‌, శివప్రసాద్‌లకు విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్‌ కోర్టు న్యాయాధికారి....

Penamaluru: పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు నోటీసులు

  • మరో ఇద్దరు ఎస్‌ఐలకు కూడా..

  • తనను కొట్టారని న్యాయాధికారికి చెప్పిన భాస్కర్‌రెడ్డి

విజయవాడ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌ జె.వెంకటరమణ, ఎస్‌ఐలు రమేశ్‌, శివప్రసాద్‌లకు విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్‌ కోర్టు న్యాయాధికారి రాధిక షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టిన కేసులో పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన మాలేటి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులపై న్యాయాధికారికి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. స్టేషన్‌లో సిబ్బందిని మొత్తం బయటకు పంపేసి ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐలు ఇష్టానుసారంగా కొట్టారని చెప్పాడు. దీంతో న్యాయాధికారి వారిద్దరికీ నోటీసులు జారీ చేశారు.

Updated Date - Nov 09 , 2025 | 06:52 AM