PP Menda Lakshminarayana: కౌంటర్ దాఖలుపై నిర్ణయానికి సమయమివ్వండి
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:21 AM
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతిచెందిన ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ...
సింగయ్య మృతి కేసులో హైకోర్టుకు పీపీ వినతి
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతిచెందిన ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు. కౌంటర్ దాఖలు చేస్తామని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దన్న తమ అభ్యర్థనను పరిగణించకుండా హైకోర్టులోని మరో న్యాయమూర్తి పిటిషనర్లపై తదుపరి చర్యలు అన్నింటినీ నిలుపుదల చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌంటర్ వేయాలా, లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకొనేందుకు విచారణను రెండువారాలకు వాయిదా వేయాలని పోలీసుల తరఫున వాదిస్తున్న ఆయన కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.